తెలుగువారి

తెలుగు పండుగలు 2027

సంక్రాంతి 2027: భోగి, సంక్రాంతి, కనుమ

భారత్‌లో, అమెరికాలో, ప్రపంచమంతటా తెలుగువారికి, మీ నగరానికి సరైన తేదీ.

ఒక్క చూపులో

భోగి
భారత్‌లో జనవరి 14, గురువారం · అమెరికాలో జనవరి 13, బుధవారం
మకర సంక్రాంతి
భారత్‌లో జనవరి 15, శుక్రవారం · అమెరికాలో జనవరి 14, గురువారం
కనుమ
భారత్‌లో జనవరి 16, శనివారం · అమెరికాలో జనవరి 15, శుక్రవారం
ముక్కనుమ
భారత్‌లో జనవరి 17, ఆదివారం · అమెరికాలో జనవరి 16, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు పంపండి

డిజైన్ ఎంచుకుని, మీ పేరు రాసి, WhatsApp లో పంపండి.

చిత్రం మీ బ్రౌజర్‌లోనే తయారవుతుంది; ఎక్కడికీ పంపబడదు.

మీ నగరంలో తేదీ

ఒకే తేదీ ఉన్న నగరాలను కలిపి చూపించాం. భారత్ తేదీకి భిన్నంగా ఉంటే హైలైట్ చేశాం.

భోగి

  • జనవరి 14, గురువారం

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, సిడ్నీ

  • జనవరి 13, బుధవారం

    న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియా, షికాగో, లండన్

మకర సంక్రాంతి

  • జనవరి 15, శుక్రవారం

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, సిడ్నీ

  • జనవరి 14, గురువారం

    న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియా, షికాగో, లండన్

కనుమ

  • జనవరి 16, శనివారం

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, సిడ్నీ

  • జనవరి 15, శుక్రవారం

    న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియా, షికాగో, లండన్

ముక్కనుమ

  • జనవరి 17, ఆదివారం

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, సిడ్నీ

  • జనవరి 16, శనివారం

    న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియా, షికాగో, లండన్

భోగి

సంక్రాంతి మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు, సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.

మకర సంక్రాంతి

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు — తెలుగువారి పెద్ద పంటల పండుగ. గొబ్బెమ్మలతో ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు, పొంగలి, గాలిపటాలు.

కనుమ

సంక్రాంతి మరుసటి రోజు కనుమ. పశువులను కడిగి అలంకరించి పూజిస్తారు, కుటుంబమంతా కలిసి విందు చేసుకుంటారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

సంక్రాంతి 2027 ఎప్పుడు?

మకర సంక్రాంతి భారత్‌లో జనవరి 15, శుక్రవారం, అమెరికాలో జనవరి 14, గురువారం.

భోగి 2027 ఎప్పుడు?

భోగి భారత్‌లో జనవరి 14, గురువారం, అమెరికాలో జనవరి 13, బుధవారం.

అమెరికాలో పండుగ తేదీ ఎందుకు మారుతుంది?

పండుగను సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని బట్టి జరుపుకుంటాం. అమెరికాలో సూర్యోదయం భారత్ కంటే దాదాపు 10 గంటలు ఆలస్యంగా వస్తుంది, కాబట్టి సూర్యోదయానికి ఉన్న తిథి మారి, పండుగ ఒక రోజు ముందో వెనకో రావచ్చు. అందుకే మీ నగరం తేదీనే చూడండి.

ప్రతి పండుగకు గుర్తు చేయించుకోవచ్చా?

తెలుగువారి క్యాలెండర్ యాప్ ప్రతి పండుగకు ముందు రోజు సాయంత్రం లేదా ఆ రోజు ఉదయం, మీ నగరం తేదీతో అలర్ట్ పంపుతుంది. ఉచితం, ప్రకటనలు లేవు.