తెలుగువారి

తెలుగువారి క్యాలెండర్

సహాయం

ప్రశ్న ఉందా, లేదా తేదీ తప్పుగా అనిపించిందా? మాకు రాయండి.

మమ్మల్ని సంప్రదించండి: teluguvaariaiapps@gmail.com
సాధారణంగా రెండు రోజుల్లో జవాబిస్తాం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పండుగ అలర్ట్స్ రావడం లేదు

యాప్‌లో అలర్ట్స్ ట్యాబ్‌లో కావలసిన పండుగలు ఆన్ చేయండి. తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లో తెలుగువారి క్యాలెండర్‌కు నోటిఫికేషన్లు అనుమతించారో చూడండి. ఫోన్ బ్యాటరీ సేవర్ కూడా అలర్ట్స్‌ను ఆపవచ్చు.

నా నగరం మార్చాలి

సెట్టింగ్స్ → ప్రాంతం: జాబితాలో మీ నగరం వెతకండి, లేదా “నా ప్రస్తుత ప్రాంతం వాడండి” నొక్కండి. సూర్యోదయం, రాహుకాలం, పండుగ తేదీలు ఆ నగరాన్ని బట్టి మారుతాయి.

పండుగ తేదీ మా పంచాంగంతో సరిపోలడం లేదు

తిథిని స్థానిక సూర్యోదయాన్ని బట్టి లెక్కిస్తాం, కాబట్టి భారత్‌లో, విదేశాల్లో కొన్ని పండుగలు ఒక రోజు తేడాతో రావచ్చు. మీ నగరం, తేదీ, యాప్ చూపించేది, మీ ముద్రిత పంచాంగం చెప్పేది మాకు రాయండి — సరిచూసి సరిదిద్దుతాం.

భాష మార్చాలి

సెట్టింగ్స్ → భాష: తెలుగు లేదా English.

యాప్ పొందండి

iPhone: App Store · Android: Google Play

గోప్యత

యాప్ మీ గురించి ఏమీ సేకరించదు. పూర్తి వివరాలు: గోప్యతా విధానం.